సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన…
బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్‌గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్…
ఎమ్మెల్సీ తనకు రాకపోవటంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాకు దేవుడు.. నేను ఆయన భక్తుడిని అన్నారు.. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు.. కానీ, నాకు పదవి వచ్చినా.. రాకపోయినా.. అంకిత భావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు..
తెలుగుదేశం పార్టీకి దశ, దిశ నారా లోకేష్ మాత్రమే.. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ…
నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. బీసీల ముద్దుబిడ్డ సీఎం చంద్రబాబు అని, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్…
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు…
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వై.ఎస్.అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా? అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ…
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా అని ఆయన అన్నారు. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారన్నారు. నా మాట చెల్లలేదు.. ఆవేదన గా ఉందని ఆయన వెల్లడించారు.…