Pakistan: ‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్‌లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
Diwali Festival 2025: దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేయడానికి అనేక పౌరాణిక, ధార్మిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండగ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో చీకటిని తరిమి కొట్టి భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి.
హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు.
Spanish MBBS Doctor Became Sanyasi: నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించి సాధ్విగా…
భారత దేశం అంటే హిందువులు. సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా.. దేశంలో 80 శాతం పైన హిందువులే. కానీ హిందువులు ఓ మతం కాదు. ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతం ఉంది. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికీ, రాజకీయాలకూ ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారా..? మధురై మురుగన్ భక్త సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మాన్ని వదిలేస్తే మనకి మూలాలే మిగలవని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతి పరిరక్షణలో తన స్థానం స్పష్టంగా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా హైందవ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ ఎదుగుతున్నారు జనసేనాని.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
హిందూ మతంలోని ప్రత్యేక పండుగలలో వసంత్ పంచమి ఒకటి. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుంది. నాలుగవ రాజస్నానం రోజున బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో…