భారతదేశంలో మత్తు పదార్థాలకు సంబంధించిన పంటలు పండించడం కానీ, వాటి రవాణా చేయడం కానీ.. నిషేధం. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక డిపార్ట్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి అంతమంది అధికారులు ఉన్నా కొందరు మాత్రం వీటిని మన దేశం మార్కెట్లోకి తీసుకువచ్చి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..
Also read: Jasprit Bumrah: ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా విజయ రహస్యమేంటంటే..?
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గురువారం గోవాలోని తన నివాసంలో గంజాయి పెంచినందుకు బ్రిటిష్ జాతీయుడిని అరెస్ట్ చేసింది. NCB బృందం అక్రమ అంతర్గత గంజాయి సాగుకు సంబంధించి ఓ పక్క సమాచారం అందుకుంది. ఆ తర్వాత వారు ఉత్తర గోవాలోని సోకోరోలో ఉన్న బ్రిటిష్ జాతీయుడైన జాసన్ ఇంటిపై దాడి చేశారు. సోదాల్లో ఇంట్లో కొత్తగా పెంచిన 33 గంజాయి మొక్కలు, 10 గ్రాముల గంజాయి, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. టెర్రస్ పై ఇతర అలంకార మొక్కలతో పాటు పూల కుండీలలో ఈ గంజాయి మొక్కలను పెంచాడు ఘనుడు.
Also read: Pakistan: పేదరికంతో తిండి పెట్టలేక.. భార్య, ఏడుగురు పిల్లల్ని నరికి చంపిన వ్యక్తి..
గతంలో నవంబర్ 28, 2022 న 107 ఎక్స్టసీ ట్యాబ్లెట్లు, 40 గ్రాముల MDMA పౌడర్, 55 గ్రాముల చరస్ లను స్వాధీనం చేసుకున్న కేసులో జాసన్ ను NCB అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. అయినా కానీ తాను ఇప్పుడు ఇలా చేయడంతో మరోమారు అతడు జైలుపాలయ్యాడు.