Ana Carolina Vieira Left Olympics village to spend a night with boyfriend: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ప్రతి అథ్లెట్ కల. విశ్వక్రీడల కోసం ఎన్నో ఏళ్లుగా కఠోర సాధన చేస్తుంటారు. ఇక ఒలింపిక్స్ సమయంలో అయితే అథ్లెట్స్ ఫోకస్ మొత్తం పతకంనే పెడతారు. ప్రతి నిమిషాన్ని పతకం కోసమే వెచ్చిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఓ అథ్లెట్ మూల్యం చెల్లించుకుంది. విశ్వక్రీడలు జరుగుతుండగా బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లి.. ఒలింపిక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది.
బ్రెజిల్ స్విమ్మర్ అయిన అనా కరోలినా వియెరా ఒలింపిక్స్ 2024 కోసం పారిస్ వచ్చింది. ఆమె బాయ్‌ఫ్రెండ్, క్రీడాకారుడు అయిన గాబ్రియేల్ శాంటోస్ కూడా అక్కడే ఉన్నాడు. శుక్రవారం (జులై 26) రాత్రి కరోలినా, శాంటోస్ కలిసి నైట్‌ఔట్ కోసం అథ్లెట్ల గ్రామం నుంచి బయటికి వెళ్లారు. ఈ జంట మరునాడు క్రీడా గ్రామం వచ్చింది. శనివారం బ్రెజిల్ జట్టుతో 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో 22 ఏళ్ల కరోలినా పాల్గొంది. పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో 28 ఏళ్ల శాంటోస్ నిష్క్రమించాడు.
Also Read: SL vs IND: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఓవర్లు.. రింకూ, సూర్య సంచనల బౌలింగ్ వీడియోస్ చూశారా?
అనా కరోలినా వియెరా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ అసలు విషయం తెలుసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఈ ఇద్దరిపై కమిటీ మండిపడింది. కరోలినాను ఒలింపిక్స్ నుంచి తొలగించి.. ఉన్నపళంగా స్వదేశానికి పంపించింది. శాంటోస్ తనను క్షమించాలని కమిటీని వేడుకోవడంతో అవకాశం ఇచ్చింది. అయితే శనివారం జరిగిన పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో శాంటోస్ ఓడిపోయాడు.