Fake Love: మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌లో ప్రేమ వ్యవహారంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మొదట ఇద్దరు ప్రేమించుకున్నారు. సంబంధం కొనసాగించారు. ఈ సమయంలోనే ప్రేమికుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియుడి వివాహం చెడగొట్టాలని ఇద్దరు కలిసినప్పుడు దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంది ప్రియురాలు. కానీ కాలం కలిసి రాక కాలం చేసింది. మార్కెట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ప్రియురాలిని దారిలో అడ్డుకుని ప్రియుడు హతమార్చాడు. నిందితుడైన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బైతుల్‌లోని ముల్తాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన అమ్మాయి పేరు సిమ్రాన్ కాగా, నిందితుడి ప్రేమికుడి పేరు సానిఫ్ మాలిక్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను పోలీసుల ప్రస్తుతం విచారిస్తున్నారు.
Read Also:Viral Video : పాపం బిర్యానీ తక్కువ పెట్టారు కాబోలు.. గిన్నెనే లేపుకెళ్లారు
వివరాల్లోకి వెళితే.. సానిఫ్, సిమ్రాన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సానిఫ్ సిమ్రాన్‌తో సంబంధాన్ని తెంచుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సానిఫ్‌కు మరో అమ్మాయితో క్రష్ ఉంది. ఆ అమ్మాయినే మరో రెండు నెలల్లో సానిఫ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సానిఫ్ పెళ్లికి సిమ్రాన్ వ్యతిరేకించింది. అలాగే వారిద్దరి ప్రైవేట్ ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేసేది. దీంతో ఆమెను ఎలాగైనా తొలగించేందుకు సానిఫ్ ప్లాన్ వేశాడు. మార్కెట్‌కి మటన్ తీసుకురావడానికి సిమ్రాన్ స్కూటీపై వెళ్తోంది. ఈ సమయంలో సానిఫ్ ఆమెను దారిలో అడ్డుకుని దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సిమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. భరారాలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Read Also:Ladies Romance: బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. అబ్బాయిలకు మించి రొమాన్స్