Kidnap Drama : ప్రేమ గుడ్డిది అంటారు. దానికి వయసుతో సంబంధం లేదు. ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. పెళ్లయిన వారితోనైనా ప్రేమలో పడొచ్చు. ఈ క్రమంలోనే ఒకరినొకరు మర్చి పోలేక అనైతిక సంబంధాలు ఎక్కువవుతున్నాయి. ఒక స్త్రీకి మరో పురుషుడితో అనైతిక సంబంధం ఏర్పడింది. భర్తను వదిలి తనతో రావాలని ప్రేమికుడు మహిళను కోరాడు. అతనితో వెళ్లేందుకు ఆ మహిళ సిద్ధంగా లేదు. ఇది ముంబైలోని మాయానగరిలో జరిగింది. వివాహితను ప్రేమికుడు పదేపదే తనతో రావాలని అభ్యర్థించాడు. ఆమె అతనితో పారిపోవడానికి నిరాకరించింది. కోపంతో ప్రియుడు తన ప్రియురాలి కుమారుడిని కిడ్నాప్ చేశాడు. సమయానికి రాకుంటే చిన్నారికి హాని చేస్తానని బెదిరించాడు.
Read Also: Terrible incident: పైసలు కోసం కన్న తల్లిని పైశాచికంగా చంపాడు
కొడుకును ప్రియుడు కిడ్నాప్ చేశాడన్న విషయం తెలియకపోవడంతో ప్రియురాలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. ఆ తర్వాత ప్రియుడు ఫోన్ చేయడంతో ప్రియురాలు పోలీసులతో కలిసి బాలుడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించింది. ఆ క్రమంలో చిన్నారి ఆచూకీతో పాటు మహిళ అనైతిక సంబంధం, ఆమె ప్రేమికుడు పన్నిన కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చింది.
Read Also: Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
ఈ కేసులో నిందితుడు మహిళ బాయ్‌ఫ్రెండ్ రిపన్ ఆమెకు ఫోన్ చేసి తను ఉన్న స్థానాన్ని చెప్పాడు. ఆ సమాచారం మేరకు పోలీసులు రైలులో నాసిక్ చేరుకున్నారు. ఎందుకంటే రిపన్ ఆ మహిళను అప్పటికే భర్తను వదిలి నాసిక్ రావాలని కోరాడు. చిన్నారికి హాని చేస్తానని బెదిరింపులు రావడంతో ఆ మహిళ పోలీసులతో కలిసి నాసిక్ వెళ్లేందుకు సిద్ధమైంది. పోలీసులకు మహిళ ఫిర్యాదు చేస్తుందని రిపన్‌కు ఆలోచన రాలేదు. నాసిక్ చేరుకున్న పోలీసులు వల వేసి చిన్నారిని కిడ్నాప్ చేసిన రిపన్‌ను రైల్వే బ్రిడ్జిపై నుంచి అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలిని తనతో రప్పించుకునేందుకే ఈ అపహరణ డ్రామాలన్నీ ఆడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.