Terrible incident: తెలంగాణలోని గద్వాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో కన్నతల్లి అని కూడా చూడకుండా నరికి చంపాడు కొడుకు. తన తండ్రిపై కొడుకు దాడి చేస్తుంటూ ఆపడమే తల్లి చేసిన నేరం. ఆవేశంతో విచక్షణ మరిచి అదే గొడ్డలితో తల్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో వెలుగు చూసింది. హరిజన నాగమ్మ (60), రాముడు దంపతులు. వీరు రామాపురంలో నివాసం ఉంటున్నారు.
Read also: Actor Vishal: విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు మొత్తం ఏడుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు వారి సంసారాలతో బిజీగా ఉన్నారు. వీరిలో మూడో కొడుకు ప్రేమ్ రాజ్ ది లవ్ మ్యారేజ్. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని నగరంలో ఉంటున్నాడు. పది రోజుల క్రితం ప్రేమ్ రాజ్ రామాపురం వచ్చాడు. 10 రోజుల తర్వాత భార్య వద్దకు తిరిగి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులిద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. తమ వద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు.
వారిపై కోపంతో ప్రేమ్ రాజ్ శుక్రవారం ఇంటి ముందు ఉన్న చెట్టును గొడ్డలితో నరుకుతుండగా..ప్రేమ్ రాజ్ తండ్రి అభ్యంతరం తెలిపారు. దాంతో ప్రేమ్ రాజ్ అదే గొడ్డలితో తండ్రిపై దాడికి దిగాడు. అది గమనించిన తల్లి కొడుకును అడ్డుకుంది. దీంతో ప్రేమ్ రాజుకు కోపం వచ్చింది. తండ్రిపై చేయాలనుకున్న దాడి తల్లిపై చేశాడు. చేతిలోని గొడ్డలితో తల్లిని విచక్షణారహితంగా నాలుగుసార్లు కొట్టాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులందరూ నిందితుడు పారిపోకుండా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతోనే తన కొడుకు ప్రేమ్ రాజ్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతని తండ్రి రామ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి హరిజన నాగమ్మ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Actor Vishal: విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే