Tragedy: అల్లూరి సీతారామరాజు జిల్లా బొందుగూడలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందాడు. డుంబ్రిగూడ మండలం బొందుగూడ గ్రామానికి చెందిన తేజ అనే మూడేళ్ల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడడంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బిస్కెట్ గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చిన్నారి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో బొందుగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Delhi: ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 7 ఫైరింజన్లు