Nayanthara: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ప్రస్తుతం తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నారు. ఇటీవలే ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక సరోగసీ ద్వారా ఈ జంట బిడ్డలను కనడం, అదికాస్తా వివాదంగా మారడం కూడా తెల్సిందే. దీనిపై ఈ జంట తమిళనాడు ప్రభత్వానికి సరైన సమాధానం చెప్పి లీగల్ గా నోరెత్తనియ్యకుండా చేశారు. తమకు ఆరేళ్ళ క్రితమే పెళ్లి అయ్యినట్లు నిరూపించి సరోగసీ లీగల్ అని నిరూపించారు.
ఇక ఈ వివాదం తరువాత ఈ జంట ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా దీనిగురించి నయన్ నోరు ఎత్తిందే లేదు. ఇక నేడు దీపావళీ సందర్భంగా ఈ జంట తమ పిల్లలతో కలిసి ప్రేక్షకులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా దీపావళీ శుబాకాంక్షలు తెలిపారు. ఇక ఈ జంట కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం నయన్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ లో నటిస్తుండగా.. విగ్నేష్.. అజిత్ తో ఒక సినిమా చేసున్నాడు.
Wishing you all A very Happy Diwali 🪔 #HappyThalaDiwali #HappyDiwali pic.twitter.com/UDL4yWesPg
— Nayanthara✨ (@NayantharaU) October 24, 2022