ఢిల్లీ లిక్కర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతన లేనే లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అవి రెండూ వేర్వేరు అంశాలని, వేర్వేరు అంశాలను జత చేయడం ఏమిటీ.. అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, డీకే. అరుణ, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ల తీరు విస్మయాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. వేర్వేరు అంశాలను రాజకీయం చేయడమేంటి..? అని ఆయన మండిపడ్డారు. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు సాధించేందుకే కల్వకుంట్ల కవిత దీక్ష చేస్తోందని ఆయన అన్నారు.
Also Read : Artemis-2: చంద్రుడిపైకి వెళ్లే వారి పేర్లను వెల్లడించనున్న నాసా.. 50 ఏళ్ల తరువాత ఇప్పుడే..
ఈనెల 13 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచడమే కవిత, బీఆర్ఎస్ ఎంపీల లక్ష్యమని ఆయన తెలిపారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 14వ తేదీ జూన్ 2014 నాడు తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్లు కోసం ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిగా దేవే గౌడ ఉన్నప్పుడు 12వ తేదీ సెప్టెంబర్ 1996 నాడు మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు.
Also Read : Japanese PM: మార్చి 20, 21 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
12వ తేదీ సెప్టెంబర్ 2016 నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేను పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు నిలదీశానని, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల తీర్మానాన్ని జత చేస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీకి స్వయంగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి మహిళా రిజర్వేషన్ల కోసం పలు దఫాలుగా కోరారని తెలిపారు. అప్పుడు సీఎం కేసీఆర్ తో పాటు నేను, కవిత, 16 వ లోక్ సభ ఎం.పీ. లు అందరూ ఉన్నారన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పలు మార్లు పార్లమెంట్ లో నేను గళమెత్తాననని ఆయన పేర్కొన్నారు.