SSMB 30: మహేష్ బాబుతో సినిమా.. రేసులో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్?
- రాజామౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29
- ఎస్ఎస్ఎంబీ 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ
- రేసులో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్?
- ఎవరు చేసినా పర్లేదు అంటున్న మహేష్ ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజామౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనే విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది.
ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అయ్యాక మహేష్ బాబుకి హాలీవుడ్ రేంజ్ స్టార్ డమ్ రావడం పక్కా. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబీ 30 అంతకుమించి అనేలా ప్లాన్ చేయడం గ్యారెంటీ. మరి ఆఫర్ట్ ఎస్ఎస్ఎంబీ 29ని, మహేష్ బాబుని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరంటే.. ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యేలా కనిపిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి, రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేసిన సుకుమార్ మరోసారి మహేష్‌తో వర్క్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబుకి హిట్ ఇవ్వలేకపోయిన సుకుమార్.. ఈసారి ఆ ఛాన్స్‌ను వదులుకునేలా లేడు. కాబట్టి.. రాజమౌళి సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Also Read: Avatar 2: అవతార్ 2 రిటర్న్స్.. ‘ఫైర్ అండ్ యాష్’ రెడీ!
ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ మధ్య ఓ స్టోరీ లైన్ కూడా వినిపించినట్టుగా టాక్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్న సందీప్.. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో యానిమల్ పార్క్ చేయనున్నాడు. కాబట్టి ఎస్ఎస్ఎంబీ 30 సందీప్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మొత్తంగా.. సుకుమార్, సందీప్ రెడ్డిలలో ఎవరో ఒకరు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేసేలా ఉన్నారనే చెప్పాలి. ఈ ఇద్దరు డైరెక్టర్లు చేసిన చివరి సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టాయి. కాబట్టి ఎవరు చేసినా పర్లేదు అని మహేష్ ఫాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..