Artemis-2: దాదాపుగా 50 ఏళ్ల క్రితం మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు. ఆ తరువాత ఏ అంతరిక్ష సంస్థ కూడా చంద్రుడి పైకి వెళ్లేందుకు సాహసించలేదు. ఎందుకంటే అంతటి క్లిష్టతతో కూడిన అంతరిక్ష ప్రయాణం కాబట్టే నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష సంస్థలు చంద్రుడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాసా మాత్రం 2024లో ఆర్టెమిస్ -2 ద్వారా మానవుడిని మరోసారి చంద్రుడిపైకి పంపాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నలుగురు వ్యోమగాములను చంద్రుడి పైకి పంపనుంది.
Read Also: CM KCR : రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం
చంద్రుడిపైకి వెళ్లి తిరిగి వచ్చేలా రూపొందించిన ఆర్టిమిస్-1 ప్రయోగాన్ని గతేడాది నాసా నిర్వహించి విజయం సాధించింది. నాసా రెండో ప్రయత్నంగా ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను పంపనుంది. అయితే ఈ సారి చంద్రుడి ఉపరితలం చుట్టూ ఉన్న కక్ష్యలోకి వ్యోమగాములను పంపాలని యోచిస్తోంది. ఈ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాముల పేర్లను ఏప్రిల్ 3న నాసా వెల్లడించనుంది. మొత్తం నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికాకు చెందని వారు కాగా.. ఒకరు కెనడా దేశస్తుడు. 50 ఏళ్ల క్రితం చివరిసారిగా అపోలో మిషన్ ద్వారా మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు.
ఆర్టెమిస్-2 మొత్తం 10 రోజుల మిషన్. 2024లో నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లాలన్నది, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలన్నది నాసా ప్లాన్. ఇది విజయవంతం అయిన తర్వాత ఆర్టిమిస్ -3 ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ -1 మిషన్ హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఆర్టెమిస్ లో భాగంగా ఉండే ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని హీట్ షీల్డ్ పునర్నిర్మాణం జరుగుతోంది. ఇది రీఎంట్రీ సమయంలో కొంత డ్యామేజ్ అయింది. వ్యోమగాముల భద్రతకు హీట్ షీల్డ్ చాలా కీలకం. రీఎంట్రీ సమయంలో భూమి వాతావరణ ఘర్షణ ఫలితంగా ఏకంగా 5000 డిగ్రీల ఫారెన్ హీట్ వేడి ఉంటుంది. దీన్ని తట్టుకునేందుకు హీట్ షీల్డ్ చాలా కీలకం.