Boats at Prakasam Barrage: వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. 7 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వగా ఇవాళ ప్రకాశం బ్యారేజి వద్ద బోట్ల తొలగింపుకు H బ్లాక్ విధానంలో మరోసారి ప్రయత్నం చేయనున్నారు అధికారులు.
Germany : జర్మనీలోని కొలోన్ నగరంలో పేలుడు..ఆ ప్రాంతాన్ని సీజ్ చేసిన పోలీసులు
సోమవారం నాడు నీట మునిగిన బోటు తేలకపోవడంతో నేటికీ వాయిదా వేశారు. ఈ ఆపరేషన్ లో 150 టన్నులు మోయగలిగే 2 భారీ ఇసుక పడవలను వాడుతున్నారు. ఇక 6 నుంచి 7 టన్నుల బరువుండే H బ్లాక్ ఉంది. 10 పుల్లీలు, 10 చైన్ లింక్ లతో మొత్తం 200 టన్నుల లోడ్ సమర్ధంతో చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఇవాళ బయటకి తేవాలని ధృఢ సంకల్పంతో H బ్లాక్ విధానమే చివరి ప్రయత్నంగా చేయనున్నారు అధికారులు.
Odisha: మిలాద్-ఉన్-నబీ ఉరేగింపులో పాలస్తీనా జెండా..