Aravind Swami: నా చెలి రోజావే అని పాట విన్నప్పుడల్లా మన కళ్ళముందు అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపమే అరవింద్ స్వామి. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి .. తన రీ ఎంట్రీ విలన్ గా ఇచ్చి మరింత షాక్ ఇచ్చాడు. విలనిజంలో స్టైల్ ను చూపించిన హీరో అంటే అరవింద్ స్వామి గురించే చెప్పాలి. ధృవ సినిమాలో రామ్ చరణ్ కు ధీటుగావిలనిజాన్ని చూపించి మెప్పించాడు. ఇక ఈ సినిమా ఆయనకు ఎంత మంచి పేరు తీసుకొచ్చి ఎట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తరువాత వరుసగా, తెలుగు, తమిళ్ చిత్రాల్లో కనిపిస్తున్న అరవింద్ స్వామి.. మొట్టమొదటిసారి మాస్ విలన్ గా కస్టడీ సినిమాలో నటిస్తున్నాడు. నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముదనకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ లో అరవింద్ స్వామి మెయిన్ విలన్ గా చూపించారు. అతడిని కాపాడే ప్రయత్నంలోనే చై ఉంటున్నట్లు చూపించారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ ను పట్టించుకోరేంటి..?
మరి అలాంటి కీలక పాత్రను చేస్తూ.. అరవింద్.. ప్రమోషన్స్ కు ఎందుకు రావడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ మీట్ లో కానీ, ప్రీ రిలీజ్ఈవెంట్ లో కానీ, ఇంటర్వ్యూలో కానీ, ఈ నటుడు కనిపించింది లేదు. ఆయన కావాలనే ప్రమోషన్స్ కు రావడం లేదా..? వేరే పనుల్లో బిజీగా ఉన్నారా..? అనేది తెలియడం లేదు. అయితే చై ఒక్కడే ఈ సినిమాను తన భుజాల మీద వేసుకొని అన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో కూడా చై ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే చై తో పాటు కృతి శెట్టి, ప్రియమణి కనిపిస్తున్నారు. అంత మంచి పాత్ర చేసిన అరవింద్ స్వామి కూడా కనిపిస్తే కొంచెం ఎక్కువ హైప్ వస్తుంది సినిమాకు.. అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ నాలుగు రోజుల్లో అరవింద్ స్వామి తన సినిమా గురించి ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.