Hyderabad: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టోందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో ప్రజలంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, ఈవెంట్ నిర్వహకులకు పలు నిబంధనలు జారి చేశారు. ‘న్యూఇయర్ వేడుకలను రాత్రి 1 గంటల వరకు ముగించాలి. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్‌ల ముందు సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలి.
Also Read: Play Store Settlement: గూగుల్ సంచలన నిర్ణయం.. వినియోదారులకు రూ. 5200 కోట్లు చెల్లింపు..!
ప్రతి ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరి. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే పదివేల రూపాయల జరిమానాలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తాం’ అని పోలీసులు హెచ్చరించారు.
Also Read: Mumbai : మద్యం మత్తులో కారు డ్రైవర్.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..