ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి "నేను ఉన్నాను.. నేను విన్నాను" అని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శనాస్త్రాలను సంధించారు.