రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేమలు మూవీ ఒకటి.మలయాళంలో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.మమిత బైజు, నస్లెన్ గఫూర్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్ మరియు శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గిరీష్ దర్శకత్వం వహించారు.మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించారు.అయితే ప్రేమలు మూవీ కేవలం మూడు కోట్లతో తెరకెక్కింది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది .మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో డబ్ చేయించి రిలీజ్ చేసారు.
ప్రేమలు సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.తెలుగులో కూడా ప్రేమలు మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ని తీసుకు రావాలని భావించారు. ఈక్రమంలోనే ఇటీవలే ఈ మూవీ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసారు. అయితే అలా అనౌన్స్ చేసారో లేదో వెంటనే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసారు.ప్రేమలు 2 షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ హీరోయిన్ మమిత బైజు తాజాగా ఒక ఫోటోను షేర్ చేసారు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ..ఇంత ఫాస్ట్ గా వున్నరేంట్రా బాబు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.మీ స్పీడ్ చూస్తుంటే ఈ సంవత్సరమే సీక్వెల్ దించేలా ఉన్నారుగా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/MamithaBaiju_/status/1786735971532415249?