అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.…
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బరిలో ఉన్నారు. నవంబర్‌లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడికాయి. విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. కాగా.. భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) పరుగులతో ఉన్నారు.
హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి…
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో ఈ వరుసకు బ్రేక్ వేసేందుకు టీమిండియా కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ క్రమంలో మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ లో, పద్మావతి కోదాడలో ముందంజలో ఉన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 3749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.