Vishnuvardhan Reddy: 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి రాకతో.. మాజీ ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి టచ్‌లోకి వస్తున్నారని తెలిపారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ట్రాప్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణువర్దన్‌రెడ్డి..
Read Also: Vandhe Bharat Train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని జింక.. అది మీద పడి ఓ మనిషి మృతి
కాగా, 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతుందంటూ విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. ఆ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ ఏది? అనే చర్చ సాగుతోంది.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.. మరోవైపు గతంలో 151 స్థానాల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ సారి ఏకంగా రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 175ని కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా ముందుకు సాగుతోంది.. మరోవైపు.. అధికార వైసీపీ ఓటమియే టార్గెట్‌గా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది.. టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతుండగా.. ఈ తరుణంలో విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కనుమరుగు అయ్యే ఆ ప్రాంతీయ పార్టీ ఏంటి? అనేది చర్చగా మారిపోయింది.