తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ ఇప్పట్నుంచే అభ్యర్థిని సిద్ధం చేస్తోందా? జూబ్లీహిల్స్‌లో తగిలిన దెబ్బ పునరావృతం అవకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తపడుతోందా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే….అభ్యర్థి ఎవరో ఆల్రెడీ డిసైడ్ చేసేసిందా? బైపోల్ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు?. జూబ్లీహిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖైరతాబాద్ ముందు వరుసలో ఉంది. 2023లో…
ఏపీ బీజేపీ అంటే.... ఒకప్పుడు వాళ్ళే కనిపించేవాళ్ళు, ఆ గొంతులే వినిపించేవి. కానీ... సడన్‌గా ఆ స్వరాలు మూగబోయాయి. నాడు మొత్తం మేమే అన్నట్టుగా హడావిడి చేసిన నాయకులు ఉన్నట్టుండి మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారట. దీనిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో. వాళ్ళలో అందరికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గురించి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్‌రెడ్డి అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. ఇక, తాజాగా బీజేపీ సీటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.. అయితే, బీజీపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఈ కీలక…
Vishnuvardhan Reddy: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు.. మాజీమంత్రి కొడాలి నాని వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని…
Vishnuvardhan Reddy: 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి రాకతో.. మాజీ ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి టచ్‌లోకి వస్తున్నారని తెలిపారు.…