Vande Bharat Train : రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది. వందే భారత్ రైలు వేగంగా వెళ్తూ పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివదయాల్ గా గుర్తించి అతడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Read Also: Bandi sanjay: నా గురువు కేసీఆర్ యే..! ఎందుకంటే?
యాక్సిడెంట్ జరిగిన వెంటనే రైలును కాసేపు ఆపేశారు. ప్రమాదానికి కారణమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజస్థాన్లోని అజ్మీర్కు వెళ్తోంది. జింక మీద పడి చనిపోయిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో జింకతో పాటు శివదయాళ్కూడా అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శివదయాల్ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది నవంబరులో.. గుజరాత్లోని ఆనంద్ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.