Putin Nuclear Test: అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
READ ALSO: Kantha : దుల్కర్ సల్మాన్ కు ప్రభాస్ సాయం.. సెంటిమెంట్ కోసమా
పుతిన్‌కు కోపం వచ్చింది..
సమగ్ర అణు-పరీక్ష-నిషేధ ఒప్పందం (CTBT) కింద రష్యా ఎల్లప్పుడూ తన బాధ్యతలను కచ్చితంగా పాటిస్తుందని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కానీ యునైటెడ్ స్టేట్స్ అమెరికా లేదా మరేదైనా దేశం అణుశక్తి లాంటి ఆయుధాన్ని పరీక్షిస్తే, రష్యా కచ్చితంగా అదే చేస్తుందని స్పష్టం చేశారు. “ఈ అంశంపై అదనపు సమాచారాన్ని సేకరించాలి. తర్వాత భద్రతా మండలిలో దానిపై విశ్లేషించి, అణ్వాయుధ పరీక్షలకు సిద్ధం కావడానికి పని ప్రారంభించాలని నేను విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ… ప్రత్యేక సేవలు, సంబంధిత పౌర సంస్థలకు ఆదేశిస్తున్నాను” అని పుతిన్ వెల్లడించారు.
అణ్వాయుధాలను రష్యా ఎక్కడ పరీక్షిస్తుంది..
ఇటీవలి అమెరికా వ్యాఖ్యలు, చర్యల దృష్ట్యా “పెద్ద ఎత్తున అణు పరీక్షలకు సన్నాహాలు వెంటనే ప్రారంభించడం సరైన చర్య” అని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ పుతిన్‌తో అన్నారు. రష్యాలోని ఆర్కిటిక్ పరీక్షా స్థలం నోవాయా జెమ్లియాలో అణ్వాయుధ పరీక్ష త్వరలో ప్రారంభమవుతుందని బెలౌసోవ్ చెప్పారు. అమెరికా ఇటీవల 50 ఏళ్ల నాటి అణు క్షిపణి అయిన మినిట్‌మ్యాన్ 3ని పరీక్షించడం రష్యా తాజాగా ఆదేశాలకు కారణం అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్షిపణి పరిధి 14 వేల కి.మీ. అని సమాచారం. అంటే ఇది రష్యా, చైనా వంటి దేశాలను సులభంగా చేరుకోగలదు. మినిట్‌మ్యాన్ 3 స్థానంలో ఒక వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇది 2030 నాటికి పూర్తవుతుందని, అప్పటి వరకు అలాంటి పరీక్షలు కొనసాగుతాయని అమెరికా పేర్కొంది.
READ ALSO: Depression Symptoms: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే డిప్రెషన్‌లో ఉన్నట్లే!