Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు చివరిదశకు చేరుకొంది. మరో రెండు వారాల్లో సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు నచ్చని సీజన్ అంటే ఇదేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ కు అడ్డా అని చెప్పి అసలు ఎంటర్ టైన్ చేయని కంటెస్టెంట్ లుగా ఈ సీజన్ కంటెస్టెంట్లు మిగిలిపోతున్నారు. ఇక ఎప్పటినుంచో బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే తాజాగా గూగుల్ బిగ్ బాస్ విన్నర్ ను లీక్ చేసింది.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు అంటే.. రోహిత్ బుల్లితెర నటుడు అంటూ చెప్పుకొచ్చింది.
రోహిత్.. భార్య మెరీనా తో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. కొద్దిగా నెమ్మదస్తుడే అయినా టాస్కుల్లో మంచిగా పెర్ ఫార్మ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గూగుల్ తల్లి.. అంచనా వేసి చెప్పిందో లేక అనుకొనే చేసిందో తెలియదు కానీ ఈసారి విన్నర్ అయితే రోహిత్ అని కన్ఫర్మ్ చేసేసింది. ఇక ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్లు.. శ్రీహాన్, రేవంత్, రోహిత్, శ్రీ సత్య, కీర్తి.. మరి వీరిలో విన్నర్ గా నిలిచేది ఎవరు..? రన్నర్ గా మిగిలేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.