Real Manjummel Boys: రీల్ కాదు రియల్ మంజుమ్మల్ బాయ్స్ ను చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Manjummel Boys Vs Reel Manjummel Boys Video goes Viral: మలయాళ చిత్రసీమలో 2024లో వచ్చిన సెన్సేషనల్ సూపర్ హిట్ మంజుమ్మల్ బాయ్స్. థియేటర్ కలెక్షన్లలో 200 కోట్లను దాటిన తొలి మలయాళ చిత్రంగా కూడా ఈ సినిమా గుర్తింపు పొందింది. కేరళలోనే కాకుండా తమిళనాడులో కూడా ఈ చిత్రానికి ఆదరణ లభించడంతో మలయాళ చిత్రసీమలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. ఏప్రిల్ 6న విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో తమిళనాడులో మంజుమ్మాళ్ బాయ్స్‌కు అపూర్వ ఆదరణ లభించింది. దానికి అతి పెద్ద నిదర్శనం సినిమా అక్కడ నుండి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్లే. ఈ ఏడాది విడుదలైన సూపర్‌స్టార్ చిత్రాలన్నింటిని బీట్ చేసి మంజుమ్మాళ్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా 2024లో తమిళనాడు నుంచి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితా బయటకు వస్తుంది. ఇందులో మొదటిది మలయాళానికి చెందిన మంజుమ్మల్ బాయ్స్.
Janhvi Kapoor: జాన్వీ ఏంటి ఇలా చూపించేసింది?
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ధనుష్ కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్ వంటి చిత్రాలను అధిగమించడం ఈ మలయాళ చిత్రం సాధించిన ఘనతగా చెబుతున్నారు. విహారయాత్రలో భాగంగా కొచ్చి నుంచి 11 మంది స్నేహితుల బృందం కొడైకెనాల్ చేరుకోవడం, అక్కడ వారికి ఎదురయ్యే సంఘటనలేమిటన్నది సినిమా కథాంశం. చిదంబరం ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తూ స్క్రీన్‌ప్లే కూడా రాశారు. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణ కెవ్ నేపథ్యంలో కథ సాగుతుంది. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదంతా రీల్ టీం, నిజమైన మంజుమ్మల్ బాయ్స్ ఎవరు ? అనే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
Real 'Manjummel Boys'
The Malayalam movie "Manjummel Boys," based on a trip of a group of friends to Kodaikanal, is making waves after the release of its Telugu version on April 6.
New screens are being added across Telugu states after a positive response.
The Real Story of… pic.twitter.com/KUjsyuivDn
— Sudhakar Udumula (@sudhakarudumula) April 10, 2024
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!