ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో లక్నో నాలుగు విజయాలు సాధించగా.. గుజరాత్ ఐదు మ్యాచ్ లు ఆడి మూడింటలో గెలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి.
Also Read : Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 121 నుంచి 193 పరుగులు చేసింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లకు మంచి సహకరం అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. లోస్కోరింగ్ గేమ్ గా సాగే అవకాశం కూడా ఉంది. గత సీజన్ లో గుజరాత్, లక్నో జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరగ్గా.. రెండింటిలోనూ హార్థిక్ సేననే గెలిచింది.
Also Read : PS-2: కమల్ చెప్తే చూసేస్తారా? ఇంకా తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు
అయితే మరోసారి హాట్ ఫేవరెట్ గా గుజరాత్ కనిపిస్తున్నా.. కేఎల్ రాహుల్ నాయకత్వంలోనే లక్నో అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ ఒంటి చెత్తో మ్యాచ్ ను గెలిపించగలరు. దీపక్ హుడా ఒక్కడే ఇప్పటి వరకు ఒక్క మంచి ఇన్సింగ్స్ కూడా ఆడలేదు. ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా సత్తాచాటుతుండగా.. బౌలింగ్ లో మార్క్ వుడ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ సింగ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోష్, అమిత్ మిశ్రా చక్కగా రాణిస్తున్నారు.
Also Read : IPL 2023 : ముంబయిని ఢీ కొట్టనున్న పంజాబ్..
ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కాస్త బలహీనంగా మారింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా మెరుపులు కేవలం ఒకటి రెండు షాట్లకే పరిమితమవుతున్నాయి. శుబ్ మన్ గిల్, హార్థిక్ పాండ్యాపై అతిగా ఆధారపడుతోంది. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ పుంజుకుంటే బ్యాటింగ్ లో కష్టాలు తీరినట్లే.. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ రూపంలో నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోస్ లిటిల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
