ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును మరోసారి పొడిగించింది.
ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ.300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగిస్తుంది. అయితే గురువారం మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌లో ఈ రాయితీని ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖజానాపై రూ.12 వేల కోట్ల భారం పడనుందని చెప్పుకొచ్చారు.
2016లో ఉజ్వల పథకాన్ని మోడీ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు.