మార్చి 8 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా భీమా. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూలను రాబట్టలేకపోయింది. కొంతమంది ఆడియన్స్ నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ కూడా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా ఏప్రిల్ 5న ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో ఆఫీసర్ అనౌన్స్మెంట్ వస్తుంది.
Also Read: Gold price Today: నేడు బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ నటించిగా టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ ఆక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. సినిమాకు హర్ష దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్న టీజర్స్. టైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
Also Read: Kishan reddy: హోలీ వేడుకల్లో మహిళలపై దాడిని ఖండించిన కిషన్‌రెడ్డి
12 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ట్రైలర్స్, టీజర్స్ లాంటి కారణంగా తొలి మూడు రోజుల్లో మంచి కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా.. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ కలెక్షన్లను ర్రబెట్టుకోలేక పోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇక భీమ తర్వాత గోపీచంద్ దర్శకుడు శ్రీనువైట్ల తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ కామెడీ అంశాలతో తెరకెక్కతున్నట్లు సమాచారం. ఈ సినిమా కు ‘విశ్వం ‘ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.