Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Speech Vikarabad Rahul Gandhi Pm Target 2026

Bhatti Vikramarka : దళితుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం..

Published Date :February 23, 2026 , 4:15 pm
By Gogikar Sai Krishna
  • రాహుల్ గాంధీ ప్రధాని కావడమే దేశానికి రక్ష
  • కుల వివక్షపై పోరాటం - రోహిత్ వేముల చట్టం
  • కుల గణనతోనే సామాజిక న్యాయం సాధ్యం
  • బీజేపీ కుట్రల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం :భట్టి
Bhatti Vikramarka : దళితుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలోనే రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలి రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ లో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. “కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి” అన్న అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమస్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారు అని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు.

ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఎవరిని కూడా యూనివర్సిటీలోకి రానివ్వలేదు అంటరానితనం సమస్యను సమస్యగా చూడాలి తప్ప రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన అని వివరించారు. ఆయన ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం రాగానే వనరులు సంపద సమానంగా పంచుతామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించారు ఆయన ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వాతంత్రం అనంతరం ఎక్కడా జరగని కుల గణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందాలని వివరించారు.

Mudragada Padmanabham: అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ..

దేశానికి స్వాతంత్రం సాధించడంతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిపారు. స్వాతంత్రం ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటుంది అన్నారు. ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం, తాను కుల వివక్షణ ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుంది అన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్య సాధనకు ముందుకు పోతున్న క్రమం లో వివక్ష ఎదురైన అది మన లక్ష్యాలను దెబ్బతీయలేదని వివరించారు.

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాదు దేశంలో అంటరానితనం, బాల్య వివాహం, వితంతు వివాహం వంటి అనేక రుగ్మతలపై దశాబ్దాలుగా ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర సంగ్రామం ఒకవైపు, సామాజిక అంశాలపై ఆందోళనలో మరోవైపు ఈ దేశంలో రెండు అంశాలను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లిందని వివరించారు. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలించాలని, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలని TK మాధవన్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేరళలో వైకాం సత్యాగ్రహ, మహారాష్ట్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చౌదర్ సత్యాగ్రహం వంటి కార్యక్రమాలను అఖిలభారత కాంగ్రెస్ కమిటీ చేపట్టింది అన్నారు. గాంధీజీ ఆధ్వర్యంలో హరిజనోద్ధరణ పేరిట పెద్ద యాత్ర చేపట్టారని దళితుల దేవాలయల ప్రవేశం, దళిత వాడల్లో పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు ఈ దేశంలో అంటరానితనాన్ని తొలగిస్తారని గాంధీ ఓ నమ్మకాన్ని ఏర్పరిచారని తెలిపారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరాని తనం నిర్మూలనకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, ఏ ఐ సి సి నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Prabhas :’ఫౌజీ’ 70% షూటింగ్ పూర్తి.. ఆ 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌తో బాక్సాఫీస్ షేక్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhatti Vikramarka: Rahul Gandhi as PM is the Solution for India's Issues | Vikarabad Training Camp Speech

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions