తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. అయితే.. ఈ జూమ్ మీటింగ్‌కు జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఈ జూమ్ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వ్యవసాయ, భూమి, రైతు సంబంధ అంశాలపైన పోరాటం పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు. వ్యవసాయ సంబంధ సమస్యలపై సీఎస్ తో సమయం తీస్కొని టీపీసీసీ బృందం కలిసి చర్చించేలా చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయాలు జుగుప్సాకరంగా మారిపోయాయని ఆయన విమర్శించారు. ఎన్నికలలో విశృంఖలంగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. వివాదాస్పద అంశాలను ముందు పెట్టి రాజకీయ ప్రయోజనాల పొందాలని బీజేపీ, టీఆర్ఎస్ లు లబ్ది పొందాలని చూస్తున్నాయన్నారు.
Also Read : PM Narendra Modi: శంకుస్థాపన ఎన్నికల జిమ్మిక్కు అన్నారు.. ఇది వారికి గట్టిదెబ్బ
పోడు భూములు, ధరణి సమస్యలు, రైతు రుణమాఫీ, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వరస పోరాటాలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక పోరాటాల కోసం ఒక ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలన్నారు. ఇదిలా ఉంటే.. వరుసగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల దాసోజు శ్రవణ్ లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడగా.. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మర్ర శశిధర్ రెడ్డి సైతం త్వరలోనే బీజేపీలో చేరేందుకు సన్నాహాలు జరుగున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలవడంపై క్రమశిక్షణ కమిటీ ఆయన్ను ఆరేళ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది.