ఇంద్రవెల్లి అంటేనే చరిత్ర గల్ల పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇంద్రవెల్లి కార్నర్ మీటింగ్ ఆయన మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరులు చేసిన పోరాటం ఈ ప్రాంతాన్నే కాదని, ప్రపంచాన్ని వనికించిందన్నారు. ఇంద్రవెల్లి అమరుల త్యాగాలు వృధా పోనివ్వమని, అమరవీరులు ఏ లక్ష్యాల కోసం పోరాటం చేశారో వాటిని నెరవేర్చడానికే నా పాదయాత్ర అని ఆయన అన్నారు. సీఎల్పీ లీడర్ గా మాట ఇస్తున్న మాట తప్పే వ్యక్తిని కాదు. అమరవీరుల ఆలోచనలను నిండుగా పెట్టుకొని వారి త్యాగాల ఫలితాలు వచ్చే వరకు పోరాటం చేస్తానన్నారు.
Also Read : Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపైకి 10 వేల మంది పోలీసుల.. గన్స్, పెట్రోల్ బాంబులు స్వాధీనం
అంతేకాకుండా.. ‘ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర మొదలుపెట్టిందే ప్రజా సమస్యల పరిష్కారానికి. తెలంగాణ వచ్చి పది ఏండ్లు అవుతున్న ప్రజల బతుకులు మారలే. బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ కుటుంబమే బంగారం అయింది. సీఎల్పీ లీడర్ గా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తో ఎదురుపడి తలపడి ప్రజా సమస్యల గొంతుక వినిపిస్తూ పోరాటం చేస్తున్న. సీఎల్పీ నేతగా మాట ఇస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో నాకు వచ్చిన సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. వర్షంలో సైతం పాదయాత్రను విజయవంతం చేయడానికి గుండెలో నిండా అభిమానంతో వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు భట్టి
Also Read : Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?