భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో బుధవారం పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ జరిగింది. అయితే.. లంచ్‌కోసమే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వచ్చామని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. పార్టీ ఇంటర్నల్ అంశాల మీద సూచనలు, అభిప్రాయాలు చేశారన్నారు. ఆయన నారాజ్ గా లేరని, భేటీలో ప్రత్యేకత ఏమి లేదన్నారు. కోమటి రెడ్డి చాలా పెద్ద లీడర్ అని మాణిక్‌రావు ఠాక్రే వ్యాఖ్యానించారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోమటి రెడ్డి సీనియర్ పార్లమెంట్ నాయకులు, మా పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని ఆయన అన్నారు. భోజనాలకు పిలిచారు వచ్చామని, పార్టీ కి సంబంధించిన ప్రణాళిక ల మీద సూచనలు, అభిప్రాయాలు చెప్పారన్నారు. అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి సమావేశం అయ్యమని, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వైబ్రంట్ లీడర్ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Also Read : Madhya Pradesh: ప్రేమికులని భావించి అన్నాచెల్లెలుపై దాడి.. రక్షాబంధన్ రోజు ఘటన
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో బుధవారం టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కమిటీ చర్చిస్తుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటన చేయాలనే ఆలోచనలో టీపీసీసీ ఉంది. ఇప్పటికే దాదాపు 24 మంది అభ్యర్థులు ఫిక్స్ అవ్వగా..మిగతా సీట్ల విషయంలో కసరత్తులు చేస్తోంది.
Also Read : Pakistan Minister: ఫోన్ చోరీకి గురి కాకుండా ఉండాలంటే.. పాక్ మంత్రి వింత సలహా