Bengaluru Crime: ఆమెకు గతంలో రెండుసార్లు వివాహం జరిగింది.. ఆయనకు ఇంతకు ముందే మూడుసార్లు వివాహం అయ్యింది. వీళ్ల మధ్య పరిచయం కాస్త లివ్-ఇన్ రిలెషన్‌షిప్‌కు దారి తీసింది. పాపం ఇక్కడే ఆమె ప్రాణాలు ఫస్ట్ టైం రిస్క్‌లో పడ్డాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఆమె అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెకు మరొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. వీళ్ల స్నేహం ఆయనకు నచ్చలేదు. దీంతో మంచి టైమ్ కోసం ఎదురు చూసి.. పక్కా ప్లాన్‌తో ఆమెపై అటాక్ చేశాడు. ఆమెపై పెట్రోల్‌పై సజీవ దహనం చేశాడు. ఈ దారణ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది..
READ ALSO: USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
ప్రాణాలు తీసిన 4 ఏళ్ల క్రితం సంబంధం..
బెంగళూరుకు చెందిన వనజాక్షి(35) అనే మహిళకు గతంలో రెండు స్లారు వివాహం జరిగింది. కానీ ఆమెకు ఆ వివాహాలు ఏ కారణం చేతనో సరిపడక ఆ బంధం నుంచి బయటికి వచ్చేసింది. అదే ప్రాంతానికి చెందిన విఠల్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు గతంలో మూడుసార్లు వివాహం అయ్యింది. విఠల్‌కు వనజాక్షికి పరిచయం అయ్యి.. అది కాస్త.. లివ్-ఇన్ రిలెషన్‌కు దారి తీసింది. ఈక్రమంలో విఠల్ తాగుడు అలవాటుతో వనజాక్షికి ఇబ్బంది ఏర్పడి ఆయన నుంచి దూరంగా వెళ్లిపోయింది. దీంతో ఆమెపై విఠల్ కోపం పెంచుకున్నాడు. వనజాక్షి ఇటీవల మరియప్ప అనే వ్యక్తితో స్నేహం చేసింది. ఈ స్నేహం విఠల్‌కు నచ్చలేదు. ఇప్పటికే ఆమెపై కోపంతో ఉన్న విఠల్ వనజాక్షిని అంతం చేయాలనే ఆలోచనకు వచ్చి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో వనజాక్షి మరియప్పతో కలిసి ఆలయానికి వెళ్లి క్యాబ్‌లో ఇంటికి తిరిగి వెళుతోంది. వీళ్ల కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వెంటనే విఠల్ వనజాక్షి, మరియప్ప, డ్రైవర్‌పై పెట్రోల్ పోశాడు. భయబ్రాంతులకు గురైన వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మరియప్ప, డ్రైవర్ తప్పించుకోగలిగారు, కానీ వనజాక్షిని విఠల్ వెంబడించి, ఆమెపై మరింత పెట్రోల్ పోసి, నిప్పంటించి తగలబెట్టాడు. ఒక యువకుడు వనజాక్షిని కాపాడి ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో నిందితుడికి కూడా గాయాలు అయ్యాయి. హులిమావు పోలీసులు 24 గంటల్లోనే అతన్ని అరెస్టు చేశారు.
24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్..
ఈ సంఘటన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.నారాయణ్ మాట్లాడుతూ.. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం అని అన్నారు. నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశామని చెప్పారు. ఆమెను రక్షించడానికి ముందుకు వచ్చిన యువకుడిని ఈ సందర్భంగా అభినందించారు. నిందితుడిపై కఠినమైన సెక్షన్లు పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు చెప్పి, దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: Terrorist Encounter: అమిత్ షా టార్గెట్‌గా ఉగ్రచొరబాట్లు.. గట్టిగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ