Rapido: బెంగళూర్‌లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె…
Deepfake Scam: రోజురోజుకి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళను రూ. 3.75 కోట్లకు పైగా మోసం చేశారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో ఉన్న డీప్‌ఫేక్ వీడియోను నమ్మడమే ఈ మోసానికి కారణమైంది. ఈ ఘటన బెంగుళూరులోని సీవీ రామన్ నగర్‌లో జరిగింది. బాధితురాలు వర్ష గుప్తా ఫిబ్రవరి 25న తన యూట్యూబ్ ఛానెల్ చూస్తుండగా, సద్గురు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఆమె కంటపడింది. ఆ వీడియోలో, సద్గురు…
Bengaluru Crime: ఆమెకు గతంలో రెండుసార్లు వివాహం జరిగింది.. ఆయనకు ఇంతకు ముందే మూడుసార్లు వివాహం అయ్యింది. వీళ్ల మధ్య పరిచయం కాస్త లివ్-ఇన్ రిలెషన్‌షిప్‌కు దారి తీసింది. పాపం ఇక్కడే ఆమె ప్రాణాలు ఫస్ట్ టైం రిస్క్‌లో పడ్డాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఆమె అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెకు మరొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. వీళ్ల స్నేహం ఆయనకు నచ్చలేదు. దీంతో మంచి టైమ్ కోసం ఎదురు చూసి..…
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. చివరకు, పెళ్లి చేసుకుందామంటేనే యువకులు భయపడే స్థాయికి చేరింది. ఇటీవల, సోనమ్ ఘటన, గద్వాల్ తేజేశ్వర్ ఘటనలు భయపెడుతున్నాయి.
Tragedy : బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకా, హళచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో లభ్యమైన గుర్తుతెలియని బాలిక మృతదేహం కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ అధికారులు ఛేదించారు. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైల్వే ట్రాక్ పక్కన పారేశారు అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బీహార్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అశిక్ కుమార్ (22), ముఖేష్…
బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది.
Bengaluru: బెంగళూర్ లో గొడ్డుమాంసం దొంగతనానికి దొంగలు మాస్టర్ ప్లాన్ చేశారు. ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తల ముసుగులో బీఫ్ మాంసాన్ని దోపిడి చేశారు. ఇందులో కీలక నిందితుడు గొడ్డుమాంసాన్ని అమ్మే వ్యక్తిగా తేల్చారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ గొడ్డు మాంసాన్ని దోచుకోవడం, కిడ్నాపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Techie Death: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. కడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.