కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో నారీమణులతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. సీట్ల కోసం ఆ మధ్య పెద్ద పంచాయితీలే జరిగాయి. మహిళలు ముష్టి యుద్ధాలకు దిగిన సందర్భాలున్నాయి. ఇక కొందరు మహిళలు.. ఆర్టీసీ ఉద్యోగులపై కూడా దాడులకు పాల్పడ్డారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. కండక్టర్‌తో గొడవకు దిగింది. టికెట్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. అయితే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి మహిళ.. కండక్టర్‌పై చేయి చేసుకోంది. దీంతో కోపోద్రేకుడైన కండక్టర్.. ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో సదరు కండక్టర్‌ను సస్పెండ్ చేసింది.
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్ విషయంలో మహిళా ప్రయాణికురాలు తంజుల (24)తో కండక్టర్ హోనప్పకు వాగ్వివాదం జరిగింది. బస్ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఓ మహిళా జోక్యం చేసుకుని వారించినా ఘర్షణ పడుతూనే ఉన్నారు. గొడవ కాస్తా ముదరడంతో ప్రయాణికురాలు.. కండక్టర్ చెంపపై కొట్టింది. దీంతో రెచ్చిపోయిన కండక్టర్ ఆమెపైకి ఒక్కసారిగా దూకి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆమె కిందపడిపోయింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా కండక్టర్ ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు.
ఈ ఘటన తర్వాత బాధిత ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. టికెట్ ఇవ్వాలని పలుమార్లు కోరినా అతడు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో కండక్టర్ తప్పిదం కనిపిస్తోందని బీఎంటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివాదం ఎలా ప్రారంభమైనప్పటికీ అతడు సహనం కోల్పోయి దాడిచేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Anupama: నేను నాగవంశీకి కాల్ చేస్తే రొమాంటిక్ సంభాషణలే ఉంటాయ్!
ఈ ఘటన తర్వాత అధికారులు హోనప్పను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో వేతంలో సగం కోల్పోనున్నాడు. అలాగే విచారణ అనంతరం అతడిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hamas Atrocities: “గన్ పాయింట్ వద్ద బెదిరించి అత్యాచారం చేసేవాడు”.. ఇజ్రాయిల్ బందీలపై హమాస్ అకృత్యాలు..
ಪುಕ್ಕಟೆ ಭಾಗ್ಯದಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದ #ತಂಝಿನಾ_ಇಸ್ಮಾಯಿಲ್ (24) ಯವತಿ ಆದರ್ ಕಾರ್ಡ್ ತೋರಿಸಿ ಅಥವಾ ಹಣ ಕೊಟ್ಟು ಟಿಕೆಟ್ ಪಡೆಯಿರಿ ಎಂದು ಕೇಳಿದ ಕಂಡಕ್ಟರ್ #ಹೊನ್ನಪ್ಪ ನ ಮೇಲೆ ಮೊದಲು ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ದಾಳೆ, ಆದರೆ ಅರೆಸ್ಟ್ ಆಗಿರೋದು ಬಡಪಾಯಿ ಕಂಡಕ್ಟರ್..! ಇದು ಯಾವ ನ್ಯಾಯ @BMTC_BENGALURU @BlrCityPolice pic.twitter.com/522vjKlkrM
— Kuberappa P H (@Kuberappaph) March 26, 2024