Anupama: నేను నాగవంశీకి కాల్ చేస్తే రొమాంటిక్ సంభాషణలే ఉంటాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran Reveals her Romantic Conversations with Naga Vamsi: సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో అదే సినిమాకి సీక్వెల్ తెరకెక్కించారు. మల్లిక్ రాం దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా రిలీజ్ కి చాలా తక్కువ సమయం ఉండడంతో రకరకాల ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగానే టాలీవుడ్ యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. నిర్మాత నాగ వంశీ హీరో హీరోయిన్లు సిద్దు, అనుపమ ఇద్దరూ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకు అనుపమ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
The Goat Life: ఇతని జీవితం మీదనే సినిమా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్
Also Read
ముందుగా యాంకర్ సుమ మీకు హీరోగా సిద్దుతో పనిచేయడం ఇబ్బందికరంగా అనిపించిందా? లేక నిర్మాత నాగ వంశీతో కలిసి పని చేయడం ఇబ్బంది అనిపించిందా అని హీరోయిన్ ని ప్రశ్నించింది. దానికి నాగ వంశీ మాట్లాడుతూ రెండేళ్ల నుంచి కొట్టుకుంటూనే ఉన్నామని చెప్పుకొచ్చాడు. సిద్దు డేట్స్ కుదిరినప్పుడు అనుపమ డేట్స్ కుదిరేది కాదు, అనుపమ డేట్స్ దొరికినప్పుడు సిద్దు క్రియేటివ్ గా రాసుకుంటూ ఉండేవాడు ఇలా రెండేళ్ల నుంచి ఇబ్బంది పడుతూ వచ్చామని అన్నాడు. రెండేళ్ల నుంచి ఒకరి వెంట ఒకరు పడుతూ కొట్టుకుంటూనే ఉన్నామని అన్నారు. ఇంకొక 15 రోజుల్లో సినిమా రిలీజ్ ఉందని తెలిసినా కూడా ఒక చిన్న ప్యాచ్ వర్క్ విషయంలో అనుపమ ఫోన్ చేసి నన్ను తిట్టింది అని నాగ వంశీ చెబితే అవును వంశీ గారికి ఫోన్ చేస్తే ఇలాంటి రొమాంటిక్ సంభాషణలు ఉంటాయని అనుపమ కౌంటర్ వేసింది. నాగ వంశీతో కాల్స్ అంటే చాలా క్రిస్పీగా ఉంటాయని ఆమె కామెంట్ చేసింది. ఇంతలో సిద్దు మాట్లాడుతూ ఇది థంబ్నెయిల్ కంటెంట్ లాగా ఉందని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!