రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశం ఉందని తెలిపారు ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ విభాగం చేసిన పనితీరు.. పార్లమెంట్ ఎన్నికలకు అదేవిధంగా పనిచేయాలి దిశ నిర్దేశం చేయడమే అజెండా అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని, జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం లేదని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఆ లక్ష్యం తోనే రాహుల్ యాత్ర చేస్తున్నారని, రిజర్వేషన్ లు అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి వస్తే ఓబీసీ గణన చేస్తామని రాహుల్ చెప్పారని బెల్లయ్య నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం, ఉద్దేశలు st విభాగం నాయకులకు వివరిస్తామని ఆయన పేర్కొ్న్నారు. లంబాడి, గోండు, ఎరుకల.. గిరిజనులు 80 శాతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశారని బెల్లయ్య నాయక్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉన్న ఆశావహులను వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్లు టికెట్లు ఆశిస్తున్నారు. అదే విధంగా కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. నిజామాబాద్ నుంచి మహేశ్కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలా రెడ్డిలను బరిలో దించే అవకాశం ఉంది.