ప్రధాని మోడీ రక్షణ రంగ ఫ్యాక్టరీలు.. పెట్టుబడులకు ఏపీలో అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు బెల్ డెరైక్టర్ పార్థసారథి. బందరు బెల్ కంపెనీ విస్తరిస్తున్నాం.. త్వరలో పూర్తి కాబోతోంది. సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో మరో బెల్ యూనిట్ ప్రారంభించబోతున్నాం.బెల్ కంపెనీకి గతంలోనే ఏపీఐఐసీ భూమి కేటాయించినా.. సరైన సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించ లేదని ఫైన్ వేసింది.అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత పాల సముద్రంలో బెల్ కంపెనీకి యూనిట్ పనుల ప్రారంభానికి అడ్డంకులు అధిగమించాం అన్నారు బెల్ డైరెక్టర్ పార్థసారథి. వచ్చే రెండేళ్ల కాలంలో పాల సముద్రం బెల్ యూనిట్ ప్రారంభించబోతున్నాం.దేశంలో మిగిలిన యూనిట్ల కంటే పాల సముద్రంలోని బెల్ యూనిట్ అతి పెద్ద ప్రాజెక్టు. దాదాపు వేయి ఎకరాల్లో పాల సముద్రం బెల్ యూనిట్ ప్రారంభం కాబోతోంది.
పాల సముద్రం బెల్ యూనిట్ కోసం తొలి విడతగా రూ. 384 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశాన్ని శత్రువుల నుంచి రక్షించేెలా అవసరమైన పరికరాలు తయారు చేయడడం బెల్ కంపెనీ ప్రధాన లక్ష్యం.తీర ప్రాంత, భూ సరిహద్దుల నుంచే కాకుండా ఆకాశ మార్గాన, సముద్ర గర్బం నుంచి జరిగే దాడులను ఆపేందుకు బెల్ కంపెనీ ఎక్విప్మెంట్ తయారు చేస్తోంది.గతంలో రక్షణ అవసరాల పరికరాలు కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం.కానీ ప్రధాని మోడీ రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయంగానే రూపొందించేలా చర్యలు తీసుకున్నారు.
Read Also: Gidugu Rudraraju: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వండి
రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించారు. మేకిన్ ఇండియా ద్వారా రక్షణ రంగ ఉత్పత్తులను మనం తయారు చేస్తూనే.. ఎగుమతులు చేస్తున్నాం అన్నారు పార్థసారథి. ఆకాశ్ మిసైల్ ను బెంగళూరు బెల్ యూనిట్ నుంచే తయారు చేస్తున్నాం.రక్షణ రంగ సాఫ్ట్ వేర్ మనమే రూపొందించుకుంటున్నాం.బందరులో బెల్ కంపెనీలో నైట్ విజన్ గ్లాసెస్ తయారు చేస్తున్నాం.బందరు బెల్ కంపెనీలో తయారు చేసే నైట్ విజన్ గ్లాసెసును విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం అన్నారు బెల్ డైరెక్టర్ పార్థసారథి.
Read Also: Xiaomi: షియోమీకి బిగ్ రిలీఫ్.. రూ.3700 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..