కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని, సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీ లో చెప్పారని, కేసీఆర్ టీమ్ కి బుద్ది చెపుతామన్నారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్ట అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారని బీర్ల ఐలయ్య అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకొని ఎన్నికలకు వాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Captain Miller : ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న కెప్టెన్ మిల్లర్..
అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జగన్ తో కుమ్మకై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారని, నీళ్ళ విషయంలో తెలంగాణకి ఏపిలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని రేపు తిప్పి కొడతామని, నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని అబద్ధాలు చెపుతున్నారన్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారని ఆయన అన్నారు. తర్వాత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణకి ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని, జగన్ కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాత నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చారన్నారు. జగన్ కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారని, కేసీఆర్ చేసిన పనుల వల్ల దక్షిణ తెలంగాణా భవిష్యత్తులో ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కొరకే కేసీఆర్ కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలు పెట్టారని ఆయన అన్నారు.