Captain Miller : ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న కెప్టెన్ మిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు.పొంగల్ సందర్భంగా జనవరి 12న భారీ అంచనాలతో కెప్టెన్ మిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయం సాధించింది.అయితే ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఇటీవలే ఫిబ్రవరి 9 న ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా ఈ యాక్షన్ డ్రామా అందుబాటులో ఉంది. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍తో వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‍లో ఈ మూవీకి భారీ వ్యూవర్‌షిప్ వస్తోంది.ఓటీటీ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో ఇండియా ట్రెండింగ్‍లో కెప్టెన్ మిల్లర్ టాప్‍లోకి వచ్చింది. నేషనల్ వైడ్‍లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, అదితి బాలన్, ఎడ్వర్ట్ సొనెన్‍బ్లిక్, జాన్ కొక్కెన్, నివేదిత సతీశ్ మరియు వినోద్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు..కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి వారి అభిప్రాయలను సోషల్ మీడియా వేదిక గా పంచుకుంటున్నారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని, థియేటర్లలో మిస్ అయినందుకు బాధపడుతున్నామని ట్వీట్లు చేస్తున్నారు. థియేటర్లో చూసినా కూడా మరోసారి ఓటీటీలో వీక్షించామని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. ధనుష్‍కు మరో జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!