బీఆర్ఎస్ నాయకులు చేసిన పాపాలని కడుక్కుంటూ.. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు గతములోనే తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లు మళ్ళీ చేస్తా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. నువ్వు పొర్లు దండాలు పెట్టిన మీ మామ నిన్న పార్టీ అధ్యక్షుడు నీ చేయరని, సలహాలు,సూచనలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ నీ బీజేపీ లో మెర్జ్ చేయడం తప్ప, బీఆర్‌ఎస్ బతికే పరిస్థితి లేదన్నారు బీర్ల ఐలయ్య. ఆగష్టు 15 లోపు,ఋణ మాఫీ చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారని, తెలంగాణా రాష్ట్రం లో ప్రజా పాలనా కోరుకొని కాంగ్రెస్ కి పట్టం కట్టారని ఆయన మండిపడ్డారు.
హరీష్ రావు మాటల తీరు చూసి ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ నీ ప్రజలు ఇంట్లో కూర్చో పెట్టిన బుద్ది రావట్లేదని, ప్రజలు ప్రతి పక్ష హోదా లో మిమ్మల్ని కూర్చొపెట్టిన ఇంకా సిగ్గు వస్తలేదన్నారు బీర్ల ఐలయ్య. మీరు చేసే చౌక బారు విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, మీరు రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోతే మీ మామ ఏమైనా అనుకుంటారని మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారా అని ఆయన మండిపడ్డారు. గెలిచిన 100 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి,dsc నోటిఫికేషన్,గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు బీర్ల ఐలయ్య.