BCCI Deadline: క్రికెట్ ప్రేమికుల చూపు ఇప్పుడు టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు ఉంది. వాస్తవానికి టీమిండియా గతంలో న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైంది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే తాజాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్ వైపు పదునైన విమర్శలు దూసుకువస్తు్న్నాయి. టీమిండియాకు గంభీర్ కోచ్‌గా వచ్చిన 16 నెలల కాలంలో భారత్ మూడు టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయింది. ఇప్పటి వరకు టీమిండియా 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే వాటిలో కేవలం 7 మ్యాచుల్లోనే విజయం సాధించింది. 10 టెస్టుల్లో పరాజయం పాలై, 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
READ ALSO: Hyderabadi Biryani: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఏకంగా కొందరు అభిమానులు గువాహటి టెస్ట్ మ్యాచ్ అనంతరం మైదానంలోనే గంభీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. గంభీర్‌పైకి ఎందరు ఎన్ని విమర్శలు చేసిన బీసీసీఐ (BCCI) మాత్రం టీమిండియా ప్రధాన కోచ్‌కు బాసటగా నిలుస్తోంది. తాజా ఓటమిపై బీసీసీఐ వర్గాలు స్పందించింది.. ‘బీసీసీఐ తొందరపాటుగా ఏ నిర్ణయాలూ తీసుకోదు. ప్రస్తుతం టీమ్‌ఇండియా మార్పు దశలో ఉంది. వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోం. కోచ్ విషయంలో సంచలన నిర్ణయాలూ ఏమీ ఉండవు. ఆయన కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఉంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
READ ALSO: BDL Apprenticeship 2025: 10th, ITI అర్హతతో.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. మీరూ ట్రై చేయండి