Womes Aisa Cup 2024 : తాజాగా బీసీసీఐ మహిళల ఆసియా కప్ 2024 టోర్నీకి సంబంధించిన జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు ఉన్న స్క్వాడ్ ను శనివారం నాడు బీసీసీఐ వెల్లడించింది. 15 మంది క్రీడాకారిణులతో పాటు, మరో నలుగురు మహిళ ప్లేయర్లను ట్రావెలింగ్ రిజర్వుగా ఎంపిక చేశారు. ఈ టోర్నీకి హార్మిన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనుంది. ఇక వైస్ కెప్టెన్ గా స్టార్ బ్యాట్ ఉమెన్ స్మృతి మందాన ఉండనుంది. ఉమెన్స్ ఏసియా కప్ టోర్నీ జూలై 19న మొదలై జూలై 28న ముగుస్తుంది. ఈ టోర్నమెంట్ శ్రీలంక వేదికగా జరగనుంది.
MS DHONI Movie Rerelease : ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..
ఈ టోర్నమెంట్ గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా టి20 ఫార్మేట్ లోనే జరగనుంది. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, టీమిండియా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ సహ మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచులు నిర్వహించబోతున్నారు. టోర్నీలో పాల్గొనే వివిధ దేశాలకు సంబంధించిన జట్టు సభ్యులను ప్రతి దేశం ఇప్పటికే ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో మొత్తం గ్రూప్ దశలో 12 మ్యాచ్లు ఉండబోతుండగా.. ఆ తర్వాత రెండు గ్రూప్స్ లో టాప్ 2 లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇక సెమి ఫైనల్లో నాక్అవుట్ మ్యాచులలో నెగ్గిన జూలై 28న జరిగే ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
A look at the @ImHarmanpreet-led squad for #WomensAsiaCup2024 in Sri Lanka 👌👌#TeamIndia | #ACC pic.twitter.com/g77PSc45XA
— BCCI Women (@BCCIWomen) July 6, 2024
HBD MS DHONI : 100 అడుగుల అభిమానం.. ధోని కట్ అవుట్ మాములుగా లేదుగా..
ఉమెన్స్ ఏసియా కప్ 2024 లో మొదటి రోజే హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయదులుగా చెప్పబడే భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు దంబుల్లా స్టేడియం వేదిక కాబోతోంది. జూలై 19 రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇదివరకు టీమిండియా పాకిస్తాన్ తో ఉమెన్స్ ఏసియా కప్ లో ఆరుసార్లు తలపడగా అన్నిటిలోనూ విజయం సాధించింది. మొత్తంగా టీమిండియా, పాకిస్తాన్ టి20 ఫార్మేట్ లో 14 సార్లు పోటీ పడగా అందులో భారత్ 11 సార్లు విజయం సాధించగా., పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఈ సిరీస్ లో భారత్ జూలై 19 పాకిస్తాన్ తో, జూలై 21న యూఏఈ తో, జూలై 23న నేపాల్ తో తలపడనుంది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన భారత మహిళల జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
టీమిండియా మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, యాదవ్ , శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.
ట్రావెలింగ్ రిజర్వ్: శ్వేతా సెహ్రావత్, సైకా ఇష్కే, తనూజా కన్వర్, మేఘనా సింగ్.