Physical Harassment : హైటెక్ అడ్డా అయిన సికింద్రాబాద్ రైల్వే పరిధిలో దారుణం చోటుచేసుకుంది.. లోకల్ ట్రైన్ లో ఏకంగా యువతి పైన అత్యాచారం చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు ..లేడీస్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లోకి జొరబడి యుతిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. కంపార్ట్మెంట్లో ఒకటే యువతి ఉండడంతో వెంటనే నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకిపోయింది.. నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు చూసి వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు .24 గంటల పాటు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాలి చివరికి ప్రాణాలు నుంచి బయటపడింది. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది .మరోవైపు లేడీస్ కంపార్ట్మెంట్ లోకి వచ్చి యువతి పైన అత్యాచారం చేయబోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు .ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కి వెళ్తున్న లేడీ పైన ఈ ప్రయత్నం జరిగింది. జొమాటోలో పనిచేస్తున్న లేడీ మేడ్చల్లో నివాసం ఉంటుంది తన సెల్ ఫోన్ చెడిపోవడంతో సాయంత్రం సికింద్రాబాద్కు వచ్చి మేడ్చల్ కి ఎంఎంటీఎస్ ట్రైన్ లో బయలుదేరింది. ట్రైన్ గుండ్ల పోచంపల్లి దాటిన తర్వాత లేడీస్ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది .ఇదే సమయంలో ఒక యువకుడు లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. కంపార్ట్మెంట్ లకి వస్తూనే లేడీ పైన అత్యాచారయత్నం చేయబోయాడు. దీంతో భయపడి పోయి లేడి నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దూకింది. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటిఎస్ రైలులో యువతి పై జరిగిన అత్యాచారయత్న ఘటన కలకలం రేపింది. రైలు బోగి లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో అతని నుండి తప్పించుకునే క్రమంలో రైలు నుండి దూకిన యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ గా పనిచేస్తున్న ఓ యువతి(23) ఈనెల 22వతేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆమె సెల్ఫోన్ రిఫేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చి ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు మహిళల కోచ్ లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళాలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వేస్టేషన్లో దిగిపోయారు. అనంతరం ఆ కోచ్ లో ఆమె ఒక్కటే ఉండగా ఓ యువకుడు (25) బోగీలోని ఆమె వద్దకు వచ్చి నువ్వు కావాలి అని అంటూ మాట్లాడగా అతడిని ఆమె గుర్తించింది. అంతలోనే గట్టిగా పట్టుకొని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడిని నుంచి తిప్పంచుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కోంపల్లి సమీపం ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కిందపడి గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రధమ చికిత్సను అందించి ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. బాధితురాలు వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Flight Break Fail: తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న డిప్యూటీ సీఎం..