పేకాట ఆడుతూ ఆరుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. పేకాట ఆడుతున్న మహిళలను పట్టుకున్నారు. వారి నుంచి 52 ప్లేయింగ్ కార్డులతో పాటు మొత్తం రూ.2,780 నగదును స్వాధీనం చేసుకున్నారు.