Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Violence After Sharif Usman Hadi Death India Security Concerns

Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్? భారత్‌కు ముప్పుగా ఉగ్రవాద గ్రూపులు!

Published Date :December 19, 2025 , 11:59 am
By RAMAKRISHNA KENCHE
Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్? భారత్‌కు ముప్పుగా ఉగ్రవాద గ్రూపులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కిపడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత, ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు రెండు వార్తాపత్రిక కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్‌ను చుట్టుముట్టారు. కమషన్ భవనంపై రాళ్ళు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా సైతం ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే.. జైష్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎదగడం సులభం అవుతుంది. ఇది మన దేశానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు.

READ MORE: TTD Parakamani Case: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Also Read

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది భారత భద్రతా సంస్థలలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. సకాలంలో కఠినమైన చర్యలు తీసుకోకపోతే, బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్ మాదిరిగానే ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే.. అక్కడ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా స్థావరాన్ని ఏర్పరచుకుంటున్నాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులతో సంబంధాలు కొనసాగించాయని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిచయాలు భారతదేశ తూర్పు ప్రాంతంలో అస్థిరత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి బలపడితే.. భారత్‌ పశ్చిమ, తూర్పు భాగాల్లో ఉగ్రవాదం నుంచి ద్వంద్వ సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని నెలల క్రితం.. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ బంగ్లాదేశ్‌లోని రాడికల్ సంస్థలతో చేతులు కలిపాయని ఒక నివేదిక పేర్కొంది. భారతీయ యువతను బ్రెయిన్‌వాష్ చేయడం, రాడికల్‌గా మార్చడం వారి లక్ష్యంగా చేసుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.. బంగ్లాదేశ్ రాడికల్ సంస్థలు లష్కరే, జైషే విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడానికి సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు.

READ MORE: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన

ఇప్పటికే.. బంగ్లాదేశ్‌లో జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా టీమ్, హిజ్బ్-ఉట్-తహ్రీర్ వంటి రాడికల్ సంస్థల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సంస్థలు గతంలో బాంబు దాడులు, లక్ష్యంగా హత్యలు, రాడికల్ భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కఠినమైన అణిచివేత చర్యలు అమలు చేశారు. దీని వలన వారి నెట్‌వర్క్ బలహీనపడింది. అయితే.. ఇటీవలి రాజకీయ అస్థిరత, పరిపాలనా నిర్లక్ష్యం మధ్య ఆ సంస్థలు మళ్లీ చురుకుగా మారవచ్చనే భయాలు ఉన్నాయి. భారత్‌కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్‌తో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ సరిహద్దులు ఇప్పటికే అక్రమ చొరబాటు, అక్రమ రవాణా, నకిలీ కరెన్సీకి ప్రసిద్ధి చెందాయి. రాడికల్ సంస్థలు తిరిగి పుట్టుకొచ్చే అవకాశం ఇస్తే, పాకిస్థాన్ విషయంలో లాగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కదలిక, స్లీపర్ సెల్స్, ఆయుధ అక్రమ రవాణాకు మార్గంగా మారవచ్చు. ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు భారత్ ఆలోచించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti India protests Bangladesh
  • Bangladesh political instability
  • Bangladesh radical groups
  • Bangladesh violence
  • Dhaka protests

తాజావార్తలు

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

  • Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..

  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions