CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఎస్ఐఆర్ (SIR) అనేది అత్యంత సీరియస్ అంశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొందరు నాయకులు ఎస్ఐఆర్ (SIR) పై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం మండిపడ్డారు. జిల్లాల వారీగా జరిగిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులపై పూర్తి రిపోర్ట్ తన వద్ద ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్ఐఆర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా మరిన్ని సదస్సులు నిర్వహించాలని, దీనిపై ఇంచార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ విషయంలో సరైన అవగాహన లేకపోతే క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా పోయే ప్రమాదం ఉందని, పేదలకు ఎలాంటి నష్టం జరగనివ్వకూడదని తేల్చి చెప్పారు.
పార్టీ ఆదేశాలను ఎవరైనా సరే ఖచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ విషయంలో పార్టీ నిబంధనలను పట్టించుకోని వారిని గుర్తించి, వారి స్థానంలో తక్షణమే మరొక ఇంచార్జ్‌ను నియమిస్తామని హెచ్చరించారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోనని, ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని అస్సలు క్షమించబోనని పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నానని, ఈ లోపు మార్పు రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఎస్ఐఆర్ (SIR) పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..