OnePlus 16T: వన్‌ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
- వన్‌ప్లస్ 16T
- స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
- ముందుగా OnePlus 16 విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్న OnePlus సంస్థ త్వరలో OnePlus 16T స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇటీవల చైనా మార్కెట్లో విడుదలైన OnePlus 15T కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. లీక్‌ల ప్రకారం, OnePlus 16Tలో 6.3 అంగుళాల హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండనుంది. కాంపాక్ట్ డిజైన్‌ను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ డిస్ప్లేను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
పనితీరు పరంగా ఈ ఫోన్లో Qualcomm Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. 2nm టెక్నాలజీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిప్సెట్ అధిక పనితీరు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందించనుంది.
Also Read
- Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
- అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
- Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
- Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
ముందుగా OnePlus 16 విడుదల
OnePlus 16T మార్కెట్లోకి వచ్చే ముందు కంపెనీ తన ప్రధాన ఫ్లాగ్షిప్ అయిన OnePlus 16 ను ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం.
OnePlus 15T ధర
చైనాలో విడుదలైన OnePlus 15T ప్రారంభ ధర CNY 4,299 (సుమారు రూ.58,000). ఈ ధరకు 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది.
OnePlus 15T ముఖ్య ఫీచర్లు
6.32 అంగుళాల AMOLED డిస్ప్లే
165Hz రిఫ్రెష్ రేట్
Qualcomm Snapdragon 8 Elite 5 చిప్సెట్
Android 16 ఆధారిత OxygenOS 16
IP66, IP68, IP69, IP69K వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
7,500mAh భారీ బ్యాటరీ
100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్
50W వైర్లెస్ ఛార్జింగ్
OnePlus 16Tలో ఏమి కొత్తగా ఉండొచ్చు?
ప్రస్తుత సమాచారం ప్రకారం OnePlus 16Tలో కూడా 15T తరహా కెమెరా, బ్యాటరీ వ్యవస్థ ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త తరం Snapdragon చిప్సెట్, మెరుగైన AI ఫీచర్లు, అధునాతన కెమెరా ప్రాసెసింగ్, పనితీరు అప్గ్రేడ్లు అందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి, కాంపాక్ట్ సైజులో ఫ్లాగ్షిప్ స్థాయి పనితీరు కోరుకునే వినియోగదారులకు OnePlus 16T ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడికానున్నాయి.
- Tags
- OnePlus
- OnePlus 16T
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!