Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కిపడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత, ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు రెండు వార్తాపత్రిక కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్‌ను చుట్టుముట్టారు. కమషన్ భవనంపై రాళ్ళు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా సైతం ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే.. జైష్,…