Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా అటు సౌత్ ఇండస్ట్రీలోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది. రెండు వైపులా ఉన్న సినీ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిందీ వర్సెస్ సౌత్ సినీ ఇండస్ట్రీల పనితీరు, హీరోయిన్ల పాత్రల పరిమితులపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
బాలీవుడ్ గురించి తమన్నా మాట్లాడుతుంటూ.. హిందీ సినిమా పరిశ్రమ నటీనటులకు ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొంది. “ప్రస్తుతం హిందీలో చూసుకుంటే ఒక వర్గానికి చెందిన నటీనటులు కేవలం కమర్షియల్ సాంగ్స్, డ్యాన్సుల వైపు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నిజానికి వారు అలాంటి కమర్షియల్ ఫార్మాట్‌కు సెట్ అవ్వరు, అందులో రాణించలేరు కూడా. కానీ, అదే నటులు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు చేసినప్పుడు మాత్రం అద్భుతంగా రాణిస్తారు, తెరపై మెరుస్తారు. హిందీ ఇండస్ట్రీలో ఆ చాయిస్ ఉంది” అని తమన్నా వివరించింది.
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
“సౌత్ సినిమా గురించి బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇక్కడి మేకింగ్ చాలా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని, ఇదొక పితృస్వామ్య భావజాలం ఉన్న చోటని, మహిళలను చూసే కోణం పెద్దగా గౌరవప్రదంగా ఉండదని రకరకాల పేర్లు పెడుతుంటారు. కానీ, నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే.. భారతదేశం ఒక మ్యూజికల్ కంట్రీ అయితే, సౌత్ ఇండస్ట్రీలో ఆ మ్యూజికల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని స్క్రీన్ పై పండించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా సాలిడ్ ‘స్టార్ క్వాలిటీ’ ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు” అని తమన్నా స్పష్టం చేసింది.
“ఇది నా వ్యక్తిగత అనుభవం మాత్రమే, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. కానీ సౌత్‌లో 10 నుండి 15 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించిన స్టార్ హీరోయిన్లను గమనిస్తే.. వారంతా ఖచ్చితంగా ఒకవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూనే, మరోవైపు మాస్ కమర్షియల్ సాంగ్స్, డ్యాన్సులను కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ మెప్పించారు. ఆ మ్యాజిక్ తెలిస్తేనే ఇక్కడ లాంగ్ కెరీర్ సాధ్యం” అని తమన్నా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!