మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి యావరేజ్ సినిమాల్లా కనిపించవు. ఆ రేంజ్ కలెక్షన్స్ ని ఫుల్ ఆఫ్ చేసాయి. ఇది కంప్లీట్ గా మహేష్ బాబు చరిష్మా కారణంగానే జరిగింది. ఇప్పుడు గుంటూరు కారం కూడా ఇదే దారిలో నడుస్తోంది. డే 1 మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది గుంటూరు కారం సినిమా. భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన వాళ్లు కాస్త డిజప్పాయింట్ అయ్యి బయటకి వస్తున్నారు.
వింటేజ్ మహేష్ బాబుని కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యి చూపించడంలో, ఇరగదీసే డాన్స్ లు వేయించడంతో థియేటర్స్ లో మహేష్ ని చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ చూపించిన ఎనర్జికి కాస్త త్రివిక్రమ్ మార్క్ కూడా తోడై ఉంటే ఘట్టమనేని అభిమానులు ర్యాంపేజ్ అంటే ఎలా ఉంటుందో చూపించే వాళ్ళు. త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినా కూడా మహేష్ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుతోంది. డే 1 అన్ని సెంటర్స్ కలిపి గుంటూరు కారం సినిమా 85-90 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో తమ సినిమా 94 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇండియాలో ఏ రీజనల్ సినిమాకైనా ఆల్ ఇండియా రికార్డ్ అనే చెప్పాలి. ప్రొడ్యూసర్స్ నుంచి ఫైనల్ ఫిగర్స్ బయటకు వస్తే డే 1 గుంటూరు కారం సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.